ఈ మార్షల్ ఆర్ట్ టూ సెక్సీ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూపే వేరు. ఇక్కడ అక్కడ అని లేదు. తనకు కావాలంటే ఎక్కడైనా శృంగార భంగిమలు చూపించగలరు. కట్స్ అండ్ కర్వ్ లు చూపించి, ప్రేక్షకులను మైమరిపించలరు. అలాంటి ఆర్జీవీ…

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూపే వేరు. ఇక్కడ అక్కడ అని లేదు. తనకు కావాలంటే ఎక్కడైనా శృంగార భంగిమలు చూపించగలరు. కట్స్ అండ్ కర్వ్ లు చూపించి, ప్రేక్షకులను మైమరిపించలరు. అలాంటి ఆర్జీవీ లేటెస్ట్ గా వదిలిన విడియో ఒకటి ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.

ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే పేరుతో నిర్మించే ఈ సినిమాలో పూజా భలేకర్ అనే అమ్మాయి హీరోయిన్ పాత్ర పోషించిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం మార్షల్ ఆర్ట్స్ ఫ్రాక్టీస్ ను కళ్లప్పగించి చూసేలా కట్ చేసారు.

మాంచి ఒడ్డు, పొడవు వున్న అమ్మాయి. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే, గుండెలు ఊగుతూ, ఉబికేలా పరుగులు పెడుతంటే జనం కళ్ల ఆర్పకుండా చూడక చస్తారా? అన్నది ఆర్జీవీ ఆలోచన కావచ్చు.

బ్రూస్ లీ మీద ఆరాధన, మార్షర్ ఆర్ట్స్ మీద అభిమానం కలిసి, తన ప్రేమను కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకవస్తే, ఆ అమ్మాయి ఏం చేసిందన్నది కథాశం అని చెప్పక చెబుతోంది టీజర్.

బ్రూస్ లీ అంటే అభిమానం వున్న ఆర్జీవీ ఆయన మాటలను కూడా టీజర్ లో గుర్తు చేసారు. ఇప్పటికే ఆర్జీవీ సినిమాలు కమ్మరాజ్యంలో కడపరెడ్లు, బ్యూటిఫుల్ విడుదలకు రెడీగా వున్నాయి. రాబోయే ఈ మార్షల్ ఆర్ట్స్ చిత్రం మూడదోది.