జనాలు సాధారణంగా ఓ విషయం సరదాగా అంటుంటారు. ఏదైనా ఓసారి రిపీట్ అయితే మూడు సార్లు జరుగుతుందని. అలాగ్గే కనిపిస్తోంది నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం సినిమా విడుదల సంగతి.
ఏప్రియల్ 19న విడుదల కావాల్సింది. కాంచన 3 అడ్డం పడింది. రెండింటికి టాగోర్ మధునే నిర్మాత కావడంతో డేట్ లు అటు ఇటు మార్చి మే 1 ఫిక్స్ చేసారు.
కానీ ఇప్పుడు అవెంజర్స్ పుణ్యమా అని మళ్లీ డేట్ మార్చాల్సి వస్తోంది. అవెంజర్స్ క్రేజ్ ఇలా అలా లేదు. హైదరాబాద్ లోని మల్టీఫ్లెక్స్ లు అన్నీ వారం రోజుల టికెట్ లు దాదాపు అమ్మేసాయి.
ఇలాంటి టైమ్ లో అర్జున్ సురవరం సినిమాకు స్క్రీన్ లు ఇచ్చేదెవరు? అందుకే వాయిదా వేయక తప్పలేదు. కానీ దగ్గరలో డేట్ లేదు. ఎందుకంటే ఆ తరువాత వారం మహర్షి సినిమా విడుదల వుంది.
ఆ తరువాత వారమే రావాలి. ఆ వారం కూడా అల్లు శిరీష్ ఏబిసిడి వుంది. మరి ఆ సినిమా మీద వేయడానికి అల్లు అరవింద్ ఊ అనాలి, సురేష్ బాబు ఓకె అనాలి.
అల్లు అరవింద్ తో టాగోర్ మధుకు మొహమాటం. సురేష్ బాబుతో డిస్ట్రిబ్యూటర్ సునీల్ కు మొహమాటం. ఆ పైవారం సీత విడుదల వుంది.
ఏం చేస్తారో? మరి.