కొత్త దర్శకుడు మల్లిడి వేణుతో హీరో కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్న ప్రాజెక్టు తుగ్లక్. కాస్త పొలిటికల్ సెటైర్ టచ్ వున్న ఈ సబ్జెక్ట్ బాగా నచ్చేసి, తానే నిర్మించడానికి ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్.
అయితే స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే వ్యవహారానికి వచ్చేసరికి, సెకండాఫ్ దగ్గర బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ ల విషయంలో కాస్త జాగ్రత్తగానే వుంటున్నాడు. తనకు అనుమానం వస్తే రైటర్ రత్నం, సత్యానంద్ లాంటి వాళ్ల సలహాలు తీసుకుంటాడు.
మల్లిడి వేణు తయారుచేసిన తుగ్లక్ లైన్ బాగుంది కానీ, సెకండాఫ్ లో ఎక్కడో తేడా కొడుతున్నట్లు కళ్యాణ్ రామ్ ఫీలవుతున్నారని బోగట్టా.
ఈ విషయమై ప్రస్తుతం డిస్కషన్లు నడుస్తున్నాయి. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయితే సెట్ మీదకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ లేటెస్ఠ్ సినిమా 118 బాగానే ఆడింది.