అఖిల్ నెక్ట్స్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ తర్వాత తమన్ పేరు పరిశీలించారు. ఫైనల్ గా గోపీసుందర్ ను ఫిక్స్ చేశారు. అవును.. అఖిల్ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించబోతున్నాడు.
గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. తనకు బాగా కలిసొచ్చిన దేవిశ్రీని ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా తీసుకోవాలని అనుకున్నాడు భాస్కర్. అటు అఖిల్ కూడా దేవిశ్రీతో ఇప్పటివరకు వర్క్ చేయలేదు కాబట్టి ఆసక్తిగానే ఎదురుచూశాడు. కానీ దేవిశ్రీ స్థానంలో ఇప్పుడు గోపీసుందర్ వచ్చిచేరాడు.
నిజానికి ఈ ప్రాజెక్టుకు వర్క్ చేయడానికి దేవిశ్రీకి కూడా ఇష్టమే. కానీ అల్లు అరవింద్ మాత్రం చాలా తక్కువ ఖర్చులో ఈ సినిమాను పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే భారీ రెమ్యూనరేషన్ తీసుకునే దేవిశ్రీని కాదని, గోపీసుందర్ ను తీసుకున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది.