యంగ్ హీరో రామ్ నటించిన శివమ్ సినిమా దసరా రేస్ లో పక్కాగా వుంటుందని తెలుస్తోంది. కిందా మీదా పడి ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసేసారు. రెండు పాటల బ్యాలన్స్ వుంటే, ఒక పాట ఇప్పుడు హైదరాబాద్ రోడ్లపై షూటింగ్ జరుపుకుంటోంది. మరో పాట చర్చిలో షూట్ చేయాల్సి వుంది. దీన్నీ ఈ వారం ఫినిష్ చేసి, 12న అడియో ఫంక్షన్ జరిపేయాలని ఆలోచిస్తున్నారు.
నార్వేలోని క్రిటికల్ లోకేషన్లలో రెండు పాటలు చిత్రీకరించారట. ఇంతవరకు ఏ భారతీయ సినిమా ఈ లోకేషన్లలో తీయలేదట. సురేందర్ రెడ్డి దగ్గర సహాయకుడిగా పనిచేసిన శ్రీనివాస రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఇదిలా వుంటే స్రవంతి మూవీస్ బ్యానర్ ప్రారంభించి ఇప్పటికి 30 ఏళ్లు పూర్తి అయ్యాయి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, అడియో ఫంక్షన్ కు ఆ సెలబ్రేషన్ కూడా జోడించాలని చూస్తున్నారు. శివమ్ కూడా అక్టోబర్ 2న అంటే, ఈసారి దసరా సీజన్ హాట్ హాట్ అన్నమాటే. ఇప్పటికే ఆ రోజు విడుదలకు కంచె రెడీ అయిపోయింది.