విష్ణు సరసన అమల పాల్?

అమల పాల్ చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కోర్కెలు కాస్త ఎక్కువగానే వున్నాయి. విష్ణు సరసన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు హీరోయిన్ గా, కాస్త నిడివి తక్కువ పాత్ర వేయమంటే, ముఫై లక్షలు…

అమల పాల్ చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కోర్కెలు కాస్త ఎక్కువగానే వున్నాయి. విష్ణు సరసన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు హీరోయిన్ గా, కాస్త నిడివి తక్కువ పాత్ర వేయమంటే, ముఫై లక్షలు అడిగిందట. దాంతో ముందు వెనుక ఆలోచిస్తున్నారట నిర్మాతలు.

మరో ఇరవై లక్షలు ఎక్కువయినా, అదే పాత్రకు కాజల్ ను తీసుకుంటే ఎలా వుంటుందీ అనుకుంటున్నారట. ఎందుకంటే విష్ణు పక్కన కాజల్ అంటే ఆ క్రేజ్ వేరు కదా? ఈ సినిమాకు కార్తీక్ రెడ్డి దర్శకుడు.

ఇప్పటికే సోనారిక (జాదూగాడు ఫేమ్) మెయిన్ హీరోయిన్ గా ఎంపికయింది. .కుమార్, పల్లి కేశవ్ రావ్ నిర్మాతలు. ఈ నెల పదిన ప్రారంభమయ్యే ఈ సినిమాకు డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తాడు.