మేనల్లుడి సినిమాకు మహేష్

ఎంతయినా మామయ్యకు మేనల్లుడు అంటే ముచ్చటే. సూపర్ స్టార్ అయినా మినహాయింపు కాదు. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు 'భలే భలే మగాడివోయ్' సినిమా చూడాలని డిసైడ్ అయిపోయారు. ఈ సినిమాలో హీరో…

ఎంతయినా మామయ్యకు మేనల్లుడు అంటే ముచ్చటే. సూపర్ స్టార్ అయినా మినహాయింపు కాదు. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు 'భలే భలే మగాడివోయ్' సినిమా చూడాలని డిసైడ్ అయిపోయారు. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించింది హీరో సుధీర్ బాబు కుమారుడు చరిత్.

సినిమా టైటిళ్ల సమయంలోనే వచ్చే ఈ పాత్ర, హీరో క్యారెక్టర్ కాన్సెప్ట్ కు పైలెట్ ఎపిసోడ్ లాంటిది. కుర్రాడు ముద్దుగా వున్నాడు, బాగానే చేసాడు అన్న రిమార్కులు వినిపించాయి. మేనల్లుడిని తెరపై చూడాలని, అలాగే సినిమా టాక్ బాగున్నందున, ఓ సారి చూడాలని మహేష్ తన ఫ్యామిలీ మెంబర్ల కోసం ఓ షో ఏర్పాటుచేసుకున్నాడట.

చూసాక, ట్వీట్ చేయడం ఖాయం. సూపర్ స్టార్ కృష్ణకు కూడా ఆనందమే. ఎందుకంటే మహేష్ కూడా ఇలాగే బాలనటుడిగా వచ్చాడు. గౌతమ్ కృష్ణ డిటో. ఇప్పుడు చరిత్.