పవన్, ప్రభాస్ లు ప్రకటన చేస్తే మంచిదేమో!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. శనివారం ఉదయం కొంతమంది పవన్ కల్యాణ్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై పవన్…

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. శనివారం ఉదయం కొంతమంది పవన్ కల్యాణ్ అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆవేశంలో వీళ్లు వెళ్లి పోలిస్ స్టేషన్ ను ముట్టడించారు. అసలు వాళ్లను వదిలేసి.. అమాయకులైన వారిని అరెస్టు చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజున ఫ్లెక్సీలను తొలగించిన వారిని అరెస్టు చేయకుండా.. ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయడం ఏమిటి? అని వారు ప్రశ్నించారు. కొన్ని వందలమంది అభిమానులు స్టేషన్ దగ్గరకు చేరుకొని నిరసన తెలిపారు.

గత మూడు రోజులుగా భీమవరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే దీన్ని లెక్క చేయకుండా పవన్ అభిమానులు శనివారం ర్యాలీలు కొనసాగించారు. మరోవైపు అభిమానుల మధ్య ఈ గొడవ నేపథ్యంలో పోలీసులు మొత్తం పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలను తీసుకొన్నారు. టౌన్ లోని మొత్తం ఫ్లెక్సీలను తీసివేసే పనిని పెట్టుకొన్నారు పోలీసులు. మొత్తం సినిమా హీరోలు అభిమానులను ఏర్పాటు చేసుకొన్న ఫ్లెక్సీలన్నింటినీ పోలీసులు తొలగించారు. 

పరిస్థితిని సద్దుమణిగేలా చేయడానికి ఇరు వర్గాల వారినీ పోలీసులు చర్చలకు పిలుస్తున్నారు. అయితే చర్చలకు పవన్ అభిమానులు ససేమేరా అంటున్నారు. ముందు పవన్ ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. తర్వాతే చర్చలకు వస్తామని వాళ్లు ప్రకటించారు. మరి సద్దుమణుగుతోందనుకొంటున్న పరిస్థితి లో తీవ్రత మళ్లీ పెరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో హీరోలు స్పందిస్తే మేలేమో! తమ అభిమానులు ఇంత ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతుందన పవన్ లేదా ప్రభాస్ లు ప్రకటనలు చేసి… అభిమానులను శాంత పరిస్థితే మేలోమో. పోలీసుల మాటలను పట్టించుకోని అభిమానులు తమ హీరోల ప్రకటనలకు అయినా విలువనిస్తారు కదా.