అల్లు అరవింద్ తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి రజనీ కాంత్ సినిమా అడియో ఫంక్షన్ కు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ వచ్చిన అసలు కనెక్షన్ వేరే వుంది. లింగా ఈస్ట్ గోదావరి హక్కులు గీతాఆర్ట్స్ తీసుకుంది. అంత భారీ సినిమాకు, కీలకమైన ప్రాంతానికి హక్కులు తీసుకున్నాక రాకుండా ఎలా?
Advertisement
ఇదిలా వుంటే అరవింద్ తమిళంలో కూడా నిర్మాతే. ఇటీవలే ప్రేమకథా చిత్రమ్ తమిళ వెర్షన్ ను ఆయన నేరుగా నిర్మించారు. మరి ఆ విధంగా కూడా తమిళ రంగంలో సంబంధాలు కలిసాయి కాబట్టి రజనీ లాంటి పెద్దనటుడు వచ్చాక ఫంక్షన్ కు రాక తప్పుతుందా?