తన కోసం చేస్తారు..తన వాళ్ల కోసం సినిమా చేస్తారు..కానీ కూతురు కోసం సినిమా చేయాల్సి వస్తే…
సరే, ఆ సంగతి అలా వుంచండి. రజనీ లాంటి స్టార్ సినిమా చేస్తానంటే, నిర్మించడానికి తమిళనాట ఎంతమంది హేమా హేమీలు సిద్దంగా వుంటారు.
మరి అలాంటిది కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు ఆ అవకాశం ఎలా దక్కింది? మొత్తం ఎటువంటి భాగస్వామ్యాలు లేకుండా రజనీ సినిమా నిర్మించిన క్రెడిట్ కొట్టేసారాయన.
నిజమా, కాదా అన్నది పక్కన పెడితే, ఈ సినిమా నిర్మించే అవకాశం రాక్ లైన్ వెంకటేష్ కు దక్కడం వెనుక కారణం వేరే వుందని గుసగుస అయితే వినిపిస్తోంది. కొచ్చడియాన్ సినిమాకు సంబంధించి రజనీ కుమార్తెతో రాక్ లైన్ వెంకటేష్ కు ఆర్థిక లావాదేవీలు వున్నాయట. ఆ సినిమా ఎంతటి డిజాస్టరో అందరికీ తెలిసిందే.
దాంతో దాని బకాయిలో, లేదా మరో వ్యవహారాల సర్దుబాటుకో రజనీ ఈ సినిమా నిర్మించే అవకాశం వెంకటేష్ కు ఇచ్చారట. దాంతో ఇంకేముందు రాక్ లైన్ వెంకటేష్ తంతే బూరెల గంపలో పడ్డారు.