అసలు కథ ఇవ్వాల్టి నుంచే

నాలుగు సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. ఫస్ట్ వీకెండ్ ఏ సినిమా లెవెల్ కు ఆ సినిమా ఫరవాలేదనిపించాయి. వాస్తవానికి ఏవరేజ్ టాక్ వచ్చినా అర్బన్ సెంటర్లలో రెండు సినిమాల కలెక్షన్లు బాగానే వున్నాయి ఫస్ట్…

నాలుగు సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. ఫస్ట్ వీకెండ్ ఏ సినిమా లెవెల్ కు ఆ సినిమా ఫరవాలేదనిపించాయి. వాస్తవానికి ఏవరేజ్ టాక్ వచ్చినా అర్బన్ సెంటర్లలో రెండు సినిమాల కలెక్షన్లు బాగానే వున్నాయి ఫస్ట్ వీకెండ్ లో. మల్టీ ఫ్లెక్స్ ల్లో, అర్బన్ క్లాస్ థియేటర్లలో రెండు సినిమాలకు కలెక్షన్లు బాగానే వున్నాయి. కానీ కింద సెంటర్లలో మాత్రం మారీ 2కు, కేజీఎఫ్ కే ఆదరణ కాస్త ఎక్కువ వుంది.

అర్బన్ సెంటర్లతో సమస్య ఏమిటంటే, వీక్ డేస్ లో కలెక్షన్లు అంతగా వుండవు. పైగా నూన్ షోలు కూడా అంతగా వుండవు. దీనివల్ల టోటల్ గా కలెక్షన్లు తగ్గే అవకాశం వుంది. కానీ ఇంకో సమస్య ఏమిటంటే, వన్ వీక్ కాకుండా సి సెంటర్లలోని ఎన్ని సింగిల్ థియేటర్లు వుంచుతారు? తీస్తారు? అన్నది తీయకపోతే, వచ్చిన షేర్ ను, రెంటల్స్ మింగేసే ప్రమాదం వుంది.

అప్పుడే హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో కలెక్షన్లు సగానికి పైగా డ్రాప్ అయ్యాయి. వీటిని లేపాలంటే, కాస్త హడావుడి, ప్రచారం, థియేటర్ టూర్ ల్లాంటివి కాస్త చేయాల్సి వుంటుందేమో? వచ్చేవారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అందువల్ల నిలబెట్టుకుంటే, కాస్త చెప్పుకోదగ్గర రికవరీ వుంటుందేమో?

టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జనసేన!

మహేష్ బాబు థియేటర్ అసలు విలువ ఎవరికెరుక