ఇక కెరీర్ క్లోజేనా?

ఇప్పుడు ప్రేక్షకులు జాలిచూపడం మానేసారు. సినిమా పూర్తి సంతృప్తికరంగా వుంటేనే చూస్తున్నారు. లేదూ అంటే పక్కన పెడుతున్నారు. టాలీవుడ్ లో నిర్మాతలు కూడా చాలావరకు ఇలా మారుతున్నారు. మారాలి కూడా.  బడ్జెట్ కంట్రోల్ చేసుకుంటూ,…

ఇప్పుడు ప్రేక్షకులు జాలిచూపడం మానేసారు. సినిమా పూర్తి సంతృప్తికరంగా వుంటేనే చూస్తున్నారు. లేదూ అంటే పక్కన పెడుతున్నారు. టాలీవుడ్ లో నిర్మాతలు కూడా చాలావరకు ఇలా మారుతున్నారు. మారాలి కూడా.  బడ్జెట్ కంట్రోల్ చేసుకుంటూ, మంచి సినిమా కాకపోయినా, కనీసం సక్సెస్ ఫుల్ సినిమా తీయగలిగిన వారినే తీసుకోవాల్సి వుంది. లేదూ అంటే నిర్మాతలు గుల్లయిపోతున్నారు.

తమ ఫ్యాషన్, తమ ఐడియాలజీ, తాము నమ్మిన సిద్దాంతం సరిపోదు. నిర్మాత సేఫ్ కూడా చూడాలి. 'నేను ఇన్ డోర్ లో మూవీ తీయలేను. అవుట్ డోర్ లోనే తీస్తాను. అందువల్ల టైమ్ ఎక్కువ పడుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది' అని చెప్పారు దర్శకుడు హను రాఘవపూడి. మొత్తం అవుట్ డోర్ లోనే డైరక్టర్ క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ సినిమాను వీలయినంత బడ్జెట్ కంట్రోల్ తో తీసారు. దర్శకుడికి అది కూడా తెలియాలి.

ఏ హీరో మీద ఎంతవరకు ఖర్చు పెట్టించవచ్చు అన్న లెక్కలు చూడాలి. లేదూ అంటే నిర్మాతల పరిస్థితి దారుణంగా వుంటుంది. శర్వానంద్ హీరోగా 32 కోట్ల నికర ఖర్చుతో సినిమా ఏమిటి? అని విడుదలకు ముందే వెల్లడించాం. ఇప్పుడు అదే నిజమైంది. 

ప్రస్తుతానికి అర్బన్ సెంటర్లలో ఎ, బి సెంటర్లలో పడి పడి లేచె మనసు సినిమా బాగానే ఆడుతోంది. కానీ అది సరిపోతుందా? అన్నది అనుమానం. నైజాంలో నాలుగు కోట్లకు పైగా రికవరి రావాలి. ఇదేకనుక 20 నుంచి 25 కోట్లలో కనుక హను సినిమాను తీయగలిగి వుంటే కచ్చితంగా నిర్మాత సేఫ్ గా వుండేవారు.

ఇప్పుడు నిర్మాతకే సమస్య కాదు. హను రాఘవపూడికి కూడా. లై సినిమాతో వెంకట్ బోయనపల్లి తదితరులకు, ఈ సినిమాతో సుధాకర్ కు ఆయన నష్టాలు ఇస్తే మరి ఏ నిర్మాత హను దగ్గరకు వస్తారు? ధైర్యంగా? కొసమెరుపు ఏమిటంటే.. ఈ సినిమాను హీరో శర్వానంద్ తన కెరీర్ బెస్ట్ సినిమా అని అనడం.

రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ లు ఇచ్చారు ఆ దర్శకులు ముగ్గురు. ఈ దర్శకుడు శర్వానంద్ కు యావరేజ్ సినిమా ఇచ్చాడు.

టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జనసేన!

మహేష్ బాబు థియేటర్ అసలు విలువ ఎవరికెరుక