Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అసలు లెక్కలు చరణ్ కే ఎరుక

అసలు లెక్కలు చరణ్ కే ఎరుక

సైరా సినిమా బిజినెస్ మీద రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఇంతకు అమ్మారు. వెస్ట్ అంతకు అమ్మారు. అడ్వాన్స్ ఇంత, రిటర్న్ బుల్ అడ్వాన్స్ అంత అటూ రకరకాల ఫిగర్లు వినిపిస్తున్నాయి. కానీ అసలు లెక్కలు, వ్యవహారాలు వేరు అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఏ ఏరియా ఎంతకు అమ్మారు? అందులో ఎన్ ఆర్ ఎ ఎంత రిటర్న్ బుల్ అడ్వాన్స్ ఎంత అన్నది అతి కొద్ది మందికే తెలుసు అని టాక్ వినిపిస్తోంది.

రామ్ చరణ్, ఆయన మేనేజర్ ప్రవీణ్, మెగా ప్యామిలీ సన్నిహితుడు శరత్ మరార్ మాత్రమే బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. బిజినెస్ డీల్ అన్నది అన్ని ఏరియాలు ఓ లెక్కలో వెళ్లడం లేదు. అన్ని విధాలా మంచి రేటు రాబట్టినట్లు కనిపించాలన్న పాయింట్ అన్నింటికన్నా ముందుగా వుంది. అందుకే రిటర్న్ బుల్, నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ ల కింద బిజినెస్ చేస్తున్నారు. కానీ ఆ రెండు కలిసిన అమౌంట్ నే బయటకు ఫీలర్లుగా వదుల్తున్నారు.

ఉదాహరణకు ఆంధ్ర 65లక్షల రేషియోలో అమ్ముతున్నారు. కానీ నెల్లూరుకు వచ్చేసరికి 60 లక్షల రేషియోలోనే మాటలు జరుగుతున్నాయి. అక్కడికి కూడా 4.80 లక్షలకు బదులు, 4.50 లక్షలకే అడుగుతున్నారు. అప్పుడు ఇంకా రేషియో తగ్గుతుంది. కానీ బయటకు మాత్రం 4.80 ప్లస్ 50 లక్షలు అన్న ఫీలర్ వదిలారు.

ఓవర్ సీస్ కు 12 కోట్ల వరకు బేరం వచ్చింది. కానీ ఆ రేటుకు ఇవ్వమని రామ్ చరణ్ చెప్పేసారు. ఇప్పుడు రెండు సంస్థలతో బేరాలు సాగుతున్నాయి. కానీ ఈ లోగానే ఇచ్చేసారు, ఇంత..అంత అంటూ ఫీలర్లు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద సైరా మంచి అంకెలకే అమ్మకాలు సాగించవచ్చు. అందులో సందేహం లేదు. కానీ బయటకు వినిపిస్తున్న అంకెలన్నీ కరెక్ట్ కాదు. అలాగే బయటకు తెలియని టెర్మ్స్ ఎన్నో వున్నాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం. ఎవరికి అమ్మినా, ఎంతకు అమ్మినా, ఏ టర్మ్స్ మేరకు అమ్మినా, ప్రతి చోటా ఎన్ ఆర్ ఏ చేస్తున్నారు తప్ప, ఔట్ రేట్ అమ్మడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?