గురు సినిమా విషయంలో చాలా లెక్కలు వినిపించాయి. ఈ సినిమాకు సంబంధించి వెంకీ రెమ్యూనిరేషన్ తీసుకోలేదని, శాటిలైట్ హక్కుల తీసుకున్నారని బలంగా వినిపించింది. వాస్తవానికి వెంకీ రెమ్యూనిరేషన్ అయిదు కోట్లు దగ్గర వుంటుంది. శాటిలైట్ ద్వారా ఆరున్నర కోట్లు వచ్చింది. సో లక్కీనే అని కూడా టాక్ వచ్చింది.
అయితే గురు అసలు లెక్కలు వేరు అని రూఢిగా తెలుస్తోంది. గురు సినిమాకు గాను హీరో వెంకీకి ముట్టిన పారితోషికం మూడు కోట్లు. సినిమా ఖర్చు అంచనా పద్దెనిమిది కోట్లుగా వేసి, ఆపైన వచ్చిన ఆదాయంలో ఫిఫ్టీ పర్సంట్ వెంకీకి ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారట. సినిమా డైరక్టర్ సుధ కొంగరకు కోటిన్నర రెమ్యూనిరేషన్ ఇచ్చారు. టోటల్ గా ప్రాజెక్టు కోసం కొటిన్నర ఇంట్రెస్ట్ లు కట్టారు. అంటే అక్కడికే మూడు ప్లస్ మూడు ఆరు కోట్లు అయిపోయింది. మిగిలిన పన్నెండు కోట్లు మేకింగ్ కు ఖర్చు చేసారు. వాస్తవానికి ఖర్చు ఇంకా కాస్త తక్కువే అని వినికిడి.
ఇదిలా వుంటే శాటిలైట్ ద్వారా ఆరున్నర కోట్లు, ఓవర్ సీస్ కర్నాటక ద్వారా మరో రెండు కోట్లు సినిమా విడుదలకు ముందే వచ్చేసింది. అంటే ఇక రావాల్సింది పది కోట్లు. ఫస్ట్ డే నాడు కొటి ఎనభై లక్షలు షేర్ వచ్చింది. రెండో రోజు కోటి వరకు మూడొ రోజు కోటిన్నరకు పైగా షేర్ వచ్చింది. టోటల్ గా ఇప్పటికి నాలుగు కోట్ల చిల్లర రికవరీ అయింది. ఇంకో అయిదు కోట్లు మాత్రమే రికవరీ కావాలి.
ఈ నెల 13 వరకు పెద్దగా సినిమాల తాకిడి లేదు. అందువల్ల ఆ లోగా కనీసం 15 కోట్లు షేర్ వసూలు చేస్తుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అంటే టొటల్ ఇన్ కమ్ శాటిలైట్, ఓవర్సీస్, కర్ణాటక కలిసి 23 కోట్ల వరకు అవుతుంది. అప్పుడు వెంకీకి మరో రెండున్నర కోట్లు లాభాల్లో వాటాగా వెళ్తుంది. నిర్మాతకు రెండున్నర కోట్లు ప్రాజెక్టు ప్రాఫిట్ గా మిగుల్తుంది.
ఇవీ గురు లెక్కలు.