ఎక్స్‌క్లూజివ్ – ఏషియన్ గ్రూప్ డీల్ చర్చలు!

టాలీవుడ్‌కు సంబంధించి నైజాంలో అతి పెద్ద వ్యాపార సంస్థ ఏషియన్ గ్రూప్. ఈ గ్రూప్ థియేటర్లు, మల్టీప్లెక్సులు, సినిమా నిర్మాణాలు వంటి అనేక వ్యాపారాల్లో భాగమై ఉంది. దగ్గుబాటి బ్రదర్స్, సునీల్ నారంగ్ కుటుంబాలు…

టాలీవుడ్‌కు సంబంధించి నైజాంలో అతి పెద్ద వ్యాపార సంస్థ ఏషియన్ గ్రూప్. ఈ గ్రూప్ థియేటర్లు, మల్టీప్లెక్సులు, సినిమా నిర్మాణాలు వంటి అనేక వ్యాపారాల్లో భాగమై ఉంది. దగ్గుబాటి బ్రదర్స్, సునీల్ నారంగ్ కుటుంబాలు ఈ గ్రూప్‌లో భాగస్వాములు.

తాజా సమాచారం ప్రకారం, ఈ సంస్థలో మెజారిటీ వాటా లేదా కొంత వాటా బాలీవుడ్ సంస్థకు విక్రయించడానికి చర్చలు మొదలయ్యాయి.

కరణ్ జోహార్ సంస్థలో వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టిన పూనావాలా సంస్థ ఇప్పుడు ఏషియన్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత శాతం వాటా అమ్ముతారు, వాటా లెక్కలు ఎలా వేస్తారు అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది, ఎందుకంటే ఏషియన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు.

దగ్గుబాటి కుటుంబం లేదా ఏషియన్ ఫ్యామిలీకి ఆర్థిక సమస్యలు లేవు, వాటా అమ్మాల్సిన అవసరం కూడా లేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు, మల్టీ ప్లెక్సులు విస్తరించాలనే ఉద్దేశంతో మరింత పెట్టుబడికి ప్రణాళికలు వేస్తున్నారు.

ఇదంతా ఇంకా ప్రారంభ దశలో ఉంది, చర్చలు పూర్తి కావాల్సి ఉంది, నిర్ణయం తీసుకునే వరకు ఇంకా సమయం ఉంది.

3 Replies to “ఎక్స్‌క్లూజివ్ – ఏషియన్ గ్రూప్ డీల్ చర్చలు!”

Comments are closed.