Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆసియన్-ఎంబీ జాయింట్ వెంచర్

ఆసియన్-ఎంబీ జాయింట్ వెంచర్

మహేష్ బాబు స్వంత బ్యానర్ తో కలిసి ఆసియన్ సునీల్ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ను గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు అగ్రిమెంట్ కుదిరింది. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమా కాక, సుకుమార్ సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా వుంటుంది. మహేష్ బాబు ఫ్యామిలీకి ఆసియన్ సునీల్ తో మంచి బంధాలు వున్నాయి. ఇన్నాళ్లూ డిస్ట్రిబ్యూషన్ లో వున్న ఆసియన్ సునీల్ తొలిసారి నిర్మాణ రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగా ఈప్రాజెక్టు ఫైనల్ చేసారు.

దీనికి డైరక్టర్ గా సందీప్ వంగా ఫిక్స్ అయ్యారు. అయితే స్క్రిప్ట్ వర్క్ మాత్రం ఇంకా జరుగుతోందని బోగట్టా. జోనర్ ఫైనల్ అయింది.  

ఇదిలా వుంటే ఆసియన్ సునీల్ కూడా ఈ విషయం ధృవీకరించారు. తాము నిర్మాణరంగంలోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, మహేష్ బ్యానర్ తో కలిసి జాయింట్ వెంచర్ చేస్తున్నామని ఆయన అన్నారు. సుకుమార్ సినిమా పూర్తయిన తరువాత తమ సినిమా వుంటుందన్నారు.

ఇదిలా వుంటే కెఎస్ రామారావుకు మహేష్ ఒక సినిమా చేస్తారని, అది సందీప్ డైరక్షన్ లోనే అని వినిపించింది. దీన్నిబట్టి చూస్తే, కేఎస్ రామారావుకు సినిమా లేనట్లే అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?