Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రీఎంట్రీ తుస్సుమంది.. ఆశలన్నీ అరవింద పైనే?

రీఎంట్రీ తుస్సుమంది.. ఆశలన్నీ అరవింద పైనే?

హీరోగా వరుసపెట్టి సినిమాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి కలిసిరాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి కమెడియన్ గా మారాడు సునీల్. రీఎంట్రీలో కమెడియన్ గా ఆయన అదరగొడతాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ కంటెంట్ సరిగ్గా లేకపోతే సునీల్ అయినా ఏం చేస్తాడు. 

అలా సిల్లీఫెలోస్ తో రీఎంట్రీ ఇచ్చిన సునీల్, జస్ట్ పాస్ మార్కులు మాత్రమే తెచ్చుకున్నాడు. అల్లరి నరేష్, సునీల్ కలిసి నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతుంది. పేరుకే కొనసాగుతోంది తప్ప, చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ మాత్రంలేదు. మరీ ముఖ్యంగా సునీల్ చించేస్తాడని ఆశించిన మాస్ జనాలకు నిరాశ ఎదురైంది. 

రీఎంట్రీ కలిసి రాకపోవడంతో ఇప్పుడు తన ఆశలన్నీ అరవింద సమేత చిత్రంపైనే పెట్టుకున్నాడు సునీల్. తన ఫ్రెండ్ త్రివిక్రమ్ అండతో కమెడియన్ గా మరోసారి క్లిక్ అవ్వాలని పరితపిస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా సునీల్ కోసం బాగానే సెటప్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. 

అరవింద సమేతలో ఎన్టీఆర్ తో పాటు దాదాపు సినిమా మొత్తం కనిపిస్తాడట సునీల్. ఎన్టీఆర్-సునీల్ మధ్య కామెడీ పంచ్ లు బాగానే పేలినట్టు తెలుస్తోంది. ఈ సినిమా క్లిక్ అయితే కమెడియన్ గా సునీల్ మరోసారి క్లిక్ అయినట్టే. ఇది కూడా తేడాకొడితే జనాలు సునీల్ నుంచి ఇంకేదో ఆశిస్తున్నారని అర్థం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?