Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

షూటింగ్ పూర్తి.. మరి రీషూట్ సంగతేంటి?

షూటింగ్ పూర్తి.. మరి రీషూట్ సంగతేంటి?

నాగార్జున, నాని కలిసి చేస్తున్న సినిమా దేవదాస్. ఈ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఈ మేరకు ఇటు నాగార్జున, అటు నాని ఈ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇద్దరూ చెరో గ్రూప్ ఫొటో కూడా షేర్ చేశారు. అంతా ఓకే. మరి రీషూట్ సంగతేంటి?

నాగార్జున సినిమా అంటే రీషూట్ ఉండాల్సిందే. అది నాగ్ మూవీ కావొచ్చు, కొడుకులు చైతన్య, అఖిల్ సినిమాలు కావొచ్చు. తనకు నచ్చకపోతే రీషూట్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తాడు నాగ్. మరి దేవదాస్ కు నాగ్ అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదా? 

దేవదాస్ సినిమాపై కూడా నాగార్జున ఓ లుక్కేశాడు. కాకపోతే తన గత చిత్రాల్లా షూటింగ్ అయిపోయిన తర్వాత రషెష్ చూసి రీషూట్లు చెప్పకుండా.. ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు-చేర్పులు చెప్పాడట. అలా షెడ్యూల్స్ తో పాటు రీషూట్స్ కూడా ఒకేసారి కంప్లీట్ చేసుకుంది దేవదాస్ చిత్రం.

ఈనెల 27న థియేటర్లలోకి రానుంది దేవదాస్. సినిమాకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయింది. సింగిల్స్ రిలీజ్ చేస్తున్నారు. వాటికి ఏమంత బజ్ రావడం లేదు. త్వరలోనే ప్రెస్ మీట్లు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లతో అదరగొట్టబోతున్నారు. ఓ మల్టీస్టారర్ సినిమా ఎలాంటి బజ్ లేకుండా థియేటర్లలోకి రావడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?