అసుర ట్రయిలర్ అదిరింది

ఇటీవలి కాలంలో వచ్చిన ఇంట్రస్టింగ్ ట్రయిలర్ ఇదే అని చెప్పుకోవాలి. నారా రోహిత్ అసుర ట్రయిలర్ గురించే ఈ మాట. ట్రయిలర్ అనేది సినిమా మీద ఆసక్తి కలిగించాలి. కథ వైనం తెలియచేయకుండానే, సినిమాను…

ఇటీవలి కాలంలో వచ్చిన ఇంట్రస్టింగ్ ట్రయిలర్ ఇదే అని చెప్పుకోవాలి. నారా రోహిత్ అసుర ట్రయిలర్ గురించే ఈ మాట. ట్రయిలర్ అనేది సినిమా మీద ఆసక్తి కలిగించాలి. కథ వైనం తెలియచేయకుండానే, సినిమాను చూడాలనే తహతహను పెంచాలి. నారా రోహిత్ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. 

Click Here For Trailer

అసుర సినిమా కూడా దీనికి ఏమాత్రం మినహాయింపు కాదని ఈ ట్రయిలర్ చెప్పకనే చెప్పింది. నోటితో చెప్పేదానికన్నా చేత్తో చెప్పేదే గుర్తుంటుంది..సమస్య నాది కాకపోతేనే నేనుమనిషిని కాదు..నాదయితే ఇంక చెప్పాలా…రాక్షసులా..వాళ్లెప్పుడైనా గెలిచారా..ఇలాంటి డైలాగులు కూడా బాగానే పేలాయి ట్రయిలర్ లో. 

చూడబోతే, మరో వైవిధ్యమైన సినిమా రాబోతున్నట్లుంది నారా రోహిత్ నుంచి. అన్నట్లు ఈ సినిమాకు సమర్పకుడు కూడా ఆయనే.