విక్టరీ వెంకటేష్ రీమేక్ చేయాలని ఫిక్స్ అయిపోయిన సినిమా అసురన్. తమిళనాట మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమాను తెలుగులో చాలా ప్రెస్టీజియస్ గా రీమేక్ చేయాలని దగ్గుబాటి బ్రదర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు డైరక్టర్ గా సరైన వ్యక్తిని ఫిక్స్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. హను రాఘవపూడి, శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతానికి ఫైనల్ లిస్ట లోకి వచ్చారని తెలుస్తోంది.
అయితే డైరక్టర్ ఎవరు అయినా మ్యూజిక్ డైరక్టర్ గా మాత్రం మణిశర్మను ఫైనల్ చేసారు. ఈ మధ్య మణిశర్మ సాధించిన క్రేజీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి.
మెగాస్టార్-కొరటాల శివ ప్రాజెక్టును అందుకున్న మణిశర్మ అసురన్ ప్రాజెక్టుకు కూడా ఓకె అయ్యారు. పూరి జగన్నాధ్ ప్రాజెక్ట్ లు వున్నాయి. హీరో రామ్ చేస్తున్న రెడ్ మూవీకీ మణిశర్మనే. బాలయ్య-బోయపాటి ప్రాజెక్టు డిస్కషన్ లో వుంది. అది కూడా ఫైనల్ అయితే 2020 లో మంచి క్రేజీ ప్రాజెక్టులు అన్నీ మణిశర్మ చేతిలో వున్నట్లే.
1992 నుంచి ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో 200 సినిమాలకు పైగా మణిశర్మ సంగీతం అందించారు. అనేక సార్లు అవార్డులు అందుకున్నారు.
సంగీత దర్శకుడిగా తగ్గిన తరువాత కూడా నేపథ్య సంగీతం కోసం అనేక మంది మణిశర్మనే ఆశ్రయించిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు మళ్లీ ఇస్మార్ట్ శంకర్ తో మణిశర్మ రీ ఎంట్రి స్టార్ట్ అయింది.