అతనికి మెగా ఫ్యామిలీ కావాలి మరి

మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైన హీరోలందరూ సక్సెస్‌లు కొట్టి బిజీగా ఉన్నారు. పవన్‌, చరణ్‌, అర్జున్‌ అయితే అగ్ర స్థాయిలో వెలుగుతున్నారు. ఇంత మంది హీరోలున్న ఏ ఫ్యామిలీతో అయినా ఎవరూ వైరం కోరుకోరు.…

మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైన హీరోలందరూ సక్సెస్‌లు కొట్టి బిజీగా ఉన్నారు. పవన్‌, చరణ్‌, అర్జున్‌ అయితే అగ్ర స్థాయిలో వెలుగుతున్నారు. ఇంత మంది హీరోలున్న ఏ ఫ్యామిలీతో అయినా ఎవరూ వైరం కోరుకోరు. అందులోను హీరోలందరితో పని చేయాలని చూసే దర్శకులైతే వారి బ్యాడ్‌ బుక్స్‌లో ఉండడానికి అస్సలు ఇష్టపడరు. 

'గౌతమిపుత్ర శాతకర్ణి', 'ఖైదీ నంబర్‌ 150' క్లాష్‌ వల్ల ప్రస్తుతానికి మెగా ఫాన్స్‌ శత్రువులా చూస్తున్నారు. దానికి ఆజ్యం పోస్తూ అతను 'ఖబడ్దార్‌' అంటూ టంగ్‌ స్లిప్‌ అయ్యాడు. తను ఖబడ్దార్‌ అన్నది చిరంజీవినే అంటూ మీడియాతో పాటు చిరు అభిమానులు కూడా ఆరోపించే సరికి తాను చిరంజీవిని ఛాలెంజ్‌ చేయలేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. 

ఇదిలావుంటే ఖైదీ నంబర్‌ 150 చిత్రంతో పాటే గౌతమిపుత్రని కూడా ఒకే రోజున విడుదల చేయాలని నందమూరి అభిమాన గణం నుంచి ఒత్తిడి వస్తోంది. అయితే శాతకర్ణి డేట్‌ అనౌన్స్‌ చేసాకే 11న రావాలని చిరు క్యాంప్‌ ఫిక్స్‌ అయింది. వాళ్లకి ఫస్ట్‌ ఇన్‌ అడ్వాంటేజ్‌ ఇవ్వరాదని, తమ సినిమాని కూడా 11నే విడుదల చేయాలని బాలయ్య కోటరీ క్రిష్‌పై ఒత్తిడి చేస్తోందట. కానీ ఇప్పుడు డేట్‌ మారిస్తే తనే పూర్తిగా విలన్‌ అయిపోతాడు కనుక ససేమీరా అని 12కే రావాలని క్రిష్‌ ఫిక్సయ్యాడట. కొసమెరుపు ఏమిటంటే, చిరంజీవి తదుపరి చిత్రం క్రిష్‌ డైరెక్షన్‌లో ఉంటుందనే పుకార్లు ఊపందుకున్నాయి.