ఇప్పటికి రెండు మూడు డేట్లు మార్చుకుంది సూర్య సింగం 3. లేటెస్ట్ గా జనవరి 26/27ను డేట్ గా ఫిక్స్ చేసుకుంది. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే, ఈసారి కూడా సింగం 3 విడుదల డవుట్ గా వుందని. ఇప్పటి వరకు రెండు మూడు డేట్లు మార్చుకోవడంతో తమిళ నాట బయ్యర్లతో సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ బయ్యర్ అనుకున్న రేంజ్ లో చెల్లింపులు చేయడానికి ముందుకు రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొందరి బయ్యర్ల విషయంలో కూడా ఇదే తరహా అభ్యంతరాలు వస్తున్నట్లు వినికిడి.
తెలుగులో కూడా సింగం 3 కోసం భారీ మొత్తం వెచ్చించారు. ఇప్పటి వరకు విడుదల లేదు. తెలుగు హక్కులు తీసుకున్న నిర్మాతకు ఇక్కడి బయ్యర్ల నుంచి కూడా వత్తిడి ఎక్కువగానే వుంది. ఈ పరిస్థితుల్లో ఈ నెలలో కూడా విడుదల కాకపోతే, బయ్యర్లు వెనక్కు పోయే ప్రమాదం వుంది.
అప్పుడు ఇక తమిళ నిర్మాత జ్ఞాన్ వేల్ రాజానే నేరుగా తెలుగు నాట కూడా విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ డేట్ మాత్రం సమస్యగా మారుతుంది. ఎందుకంటే మళ్లీ ఫిబ్రవరి రెండోవారం నుంచి వరుసగా సినిమాలు వున్నాయి. పైగా పరీక్షల సీజన్ కూడా ప్రారంభమైపోతుంది.