రాఘవేంద్రరావు-నాగార్జున అంటే ఎన్ని సినిమాలు వున్నా గుర్తుకు వచ్చేవి అన్నమయ్య..శ్రీరామదాసు..షిరిడి సాయి. మళ్లీ మరోసారి ఇదే కాంబినేషన్, ఇదే టైపు సినిమాను అందించబోతున్నాయి. రచయిత భారవి..సంగీత దర్శకుడు కీరవాణి కూడా జత కలుస్తున్నారు.
టీటీడీ బోర్టు మెంబర్ గా వున్న రాఘవేంద్రరావు హీరో నాగార్జునకు అత్యంత సన్నహితుల్లో ఒకరు. అందుకే రాఘవేంద్రరావు-భారవి ఆలోచించిన లైన్ కు నాగ్ ఓకె అనేసారు. భారవి ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ పనిపై వున్నారు.
అయితే కథేమిటి? నాగ్ పాత్ర ఏమిటి? మరేమిటి? అన్నది మరో వారం పది రోజుల్లో వెల్లిడిస్తారు. బహుశా హాథీరామ్ బావాజీ అనే భక్తుడి కథ కావచ్చని వినికిడి.