ఓటిటికి వెళ్లిలేదు..థియేటర్లలోకి వెళ్లే దారిలేదు. ఇలా సందిగ్ధంలో కొట్టుకుంటోంది నాని నటించిన టక్ జగదీష్. ఈ సినిమా చకచకా షూటింగ్ జరిపేసుకుంది. సింగిల్ బయ్యర్ లక్ష్మణ్ ప్రొడెక్ట్ ను కొనుగోలు చేసుకున్నారు. అంతా బాగానే వుంది. కానీ కరోనా వచ్చి పడింది. దాంతో విడుదల ఆగిపోయింది.
ఇప్పుడు విడుదల చేద్దాం అంటే ఆంధ్రలో టికెట్ రేట్లు లేవు. బయ్యర్లు గతంలో ఇచ్చిన కమిట్ మెంట్ ను కాదంటున్నారు. పోనీ ఓటిటికి ఇద్దామా అంటే హీరో నానికి ఇష్టం లేదు. కొనుక్కున్న లక్ష్మణ్ కు ఇష్టం లేదు.
ఇప్పటికే వి సినిమాను ఓటిటికి ఇచ్చి నాని దెబ్బతిన్నారు. మళ్లీ వెంటనే మరో సినిమా ఓటిటికి ఇవ్వడం హీరోకి ఇష్టం లేదు. అలాగే దిల్ రాజు దగ్గర నుంచి వేరు పడిన తరువాత బయ్యర్ లక్ష్మన్ కు రెండు రాష్ట్రాల్లో విడుదల చేసే తొలిసినిమా ఇది. అందువల్ల ఆయనకు కూడా ఓటిటికి ఇవ్వడం అంత ఇష్టం లేదు .
వాస్తవానికి 40 కోట్లకు ఓటిటి ఆఫర్ వుంది. సైన్ చేయాలా? వద్దా అని నిర్మాత సాహు ఊగిసలాడుతున్నారు. ఈ వారం లొ టికెట్ రేట్లు కొత్తవి వస్తే ఓకె. లేదంటే ఇది కూడా ఓటిటికి వెళ్లేలా వుంది చూస్తుంటే వ్యవహారం.