Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆగస్టు 9న మహేష్ లుక్?

ఆగస్టు 9న మహేష్ లుక్?

ఆగస్టు తొమ్మిది అంటే ఎవరికి ఆసక్తి వున్నా లేకున్నా మహేష్ బాబు అభిమానులకు మాత్రం భలే ఆసక్తి. ఎందుకంటే ఆ రోజే కదా సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే. అందుకే. ఈసారి మహేష్ బర్త్ డే కు ఏమిటి స్పెషల్ అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ కాంబినేషన్ లోని సినిమా ఫస్ట్ లుక్ ఇస్తారా? ఇవ్వరా? అన్నది ఓ అనుమానం. 

సినిమా షూట్ పార్ట్ చేసి ఇంకా ఎన్నో రోజులు కాలేదు. పైగా టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. మరి అలాంటపుడు ఫస్ట్ లుక్ మరి ఇవ్వడానికి డైరక్టర్ మురుగదాస్ ఓకె అనాల్సి వుంటుంది. లేదూ అభిమానుల ఆసక్తి మేరకు ఏదో ఒకటి చేయాలని అనుకోవడం సహజం కాబట్టి, టైటిల్ అనౌన్స్ మెంట్ కాకున్నా ఓ లుక్ అన్నా ఇస్తారా అన్నది వేచి చూడాల్సి విషయం. 

ఈ విషయంలో తుది నిర్ణయాన్ని మహేష్ కే సినిమా యూనిట్ వదిలేసినట్లు తెలుస్తోంది. మహేష్ కనుక ఓకె అంటే ఓ స్టిల్ వదిలే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?