వెనకటికి సామెత వుంది. ఏ మొగుడు లేకుంటే అప్ప మొగుడే అని. అలాగ్గానే వుంది చూస్తుంటే ఈ వ్యవహారం. బన్నీ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ స్క్రిప్ట్ తయారుచేయించారు నిర్మాత కేఎస్ రామారావు అని టాక్. కానీ వాళ్లిద్దరు హొల్ సేల్ గా పెదవి విరిచేసి,నో అన్నారట గుసగుస. మరి దాన్నేం చేయాలి. అందుకే మెగా-నందమూరి జూనియర్లు లాంటి సాయి ధరమ్ తేజ, కళ్యాణ్ రామ్ ల దగ్గరకు పట్టుకెళ్లారట.
ఇప్పుడు వాళ్లు కూడా ఇంకా చేయాలా వద్దా అని కిందా మీదా పడుతున్నారు. పైగా దీనికి దర్శకుడు ఎవరు? ఎఎస్ రవికుమార్ చౌదరి. సౌఖ్యం లాంటి డిజాస్టర్ ఇచ్చిన రవికుమార్ చౌదరి. మరి సెకెండ్ హ్యాండ్ స్క్రిప్ట్, డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ కదా, అంత త్వరగా ఓకె చెబుతారా? ఏమో? ప్రస్తుతానికి సాయి ధరమ్ చేతిలో కూడా ఇంకా సెట్ మీదకు వెళ్లని గోపీచంద్ మలినేని సినిమా ఒక్కటే వుంది. కళ్యాణ్ రామ్ దగ్గర పూరి తో చేస్తున్న ఇజమ్ ఒక్కటే. అందువల్ల ఊ కొట్టేస్తారేమో?