ఆంటీ అని ఒప్పుకోవడానికి ఎందుకంత బెట్టు?

యవ్వనం ఒక ఫాంటసీ.. బాలిక యువతి అయ్యాక ఆటోమేటిక్‌గా ఆంటీ అవ్వక తప్పదుగా. ఎప్పుడో యువతిగా డిగ్రీ చదువుకుని, టీవీ సీరియల్స్‌లో నటించి, ఆ తర్వాత టీవీ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన టాప్‌ యాంకర్‌…

యవ్వనం ఒక ఫాంటసీ.. బాలిక యువతి అయ్యాక ఆటోమేటిక్‌గా ఆంటీ అవ్వక తప్పదుగా. ఎప్పుడో యువతిగా డిగ్రీ చదువుకుని, టీవీ సీరియల్స్‌లో నటించి, ఆ తర్వాత టీవీ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన టాప్‌ యాంకర్‌ సుమ, ఇప్పటికి ఇరవై ఏళ్ళు పూర్తి చేసేసుకుంది. 

తమాషా ఏంటంటే, యాంకరింగ్‌ చేసేటప్పుడు తనని ఎవరైనా ఆంటీ అన్నా అక్కా అని పిలిచినా షాక్‌ అయ్యి, ఆ తర్వాత కవర్‌ చేసుకోడానికి నానా తంటాలూ పడుతుంటుంది. ఇటీవల ‘ఆంధ్రా పోరీ’ టీమ్‌తో క్యాష్‌ ప్రోగ్రామ్‌ చేసింది. ఆ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అక్కా అన్నాడు పూరి తనయుడు. ఆకాష్‌ ఆంటీ అన్నాడు.. అప్పుడు ఆవిడ హావభావాలు చాలా ఇబ్బంది పడుతున్నట్లే కనిపించాయి. 

సుమ ఇంకా తాను యువతిననే అనుకుంటోందా? లేక నిత్య యవ్వనంతో వుండే వరం ఏమైనా పొందిందా? అని విమర్శించే వాళ్ళకు ఒక్కటే సమాధానం. సుమ యాంకరింగ్‌లో నిజాయితీ వుంటుంది.. అనేస్తుంది.. అనిపించుకుంటుంది. తేలిగ్గా నవ్వేస్తుంది. మళ్ళీ రెండు సెకెన్లలో కొత్తగా కనిపిస్తుంది. దటీజ్‌ సుమ. అందుకే ఇన్నాళ్ళూ అలాగే వుంది.