ఆ దమ్ము, ఖలేజా వాళ్ళకు వుందా?

ఒక్కో సీజన్‌లో ఒక్కో హీరోయిన్‌ పైకొస్తుంది. అలాగని వెలుగు తగ్గినవాళ్ళు వెలిగే తారలను తన్ని తరిమేస్తారనడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఇండియాను ఊపేస్తున్న సన్నీలియోన్‌ పేరు ప్రతిష్టలు చూసి ఓర్వలేని రాఖీసావంత్‌ తన అక్కసుని…

ఒక్కో సీజన్‌లో ఒక్కో హీరోయిన్‌ పైకొస్తుంది. అలాగని వెలుగు తగ్గినవాళ్ళు వెలిగే తారలను తన్ని తరిమేస్తారనడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఇండియాను ఊపేస్తున్న సన్నీలియోన్‌ పేరు ప్రతిష్టలు చూసి ఓర్వలేని రాఖీసావంత్‌ తన అక్కసుని బయటపెట్టుకున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు హిందీలో వున్న మిగతా సెక్సీ హీరోయిన్స్‌ కూడా మెల్లగా సన్నీలియోన్‌ని టార్గెట్‌ చేసుకుని ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో నానా రాతలూ రాసి ఈర్ష్యపడుతున్నారట. 

ఇక ఎంతో ఓపిక చూపించిన సన్నీలియోన్‌ వాళ్ళకు గట్టిగా బుద్దిచెప్పాలనుకుని, నేనూ నా లైఫ్‌ స్టయిల్‌ తెరచిని పుస్తకం. నేను మొత్తం చూపించేశాను. నాలా చూపించే దమ్మ, ఖలేజా మీకుందా? ఎందుకు నోరుపారేసుకుంటారు? నా పబ్లిక్‌ లైఫ్‌ కన్నా వరస్ట్‌ మీ చీకటి జీవితం. ఒక్కసారి ఆలోచించుకోండి.. అంటూ ఛాలెంజ్‌ చేసింది. 

ఎవరైనా సరే, ఫేస్‌ టూ ఫేస్‌ నా లోపాలను ఎత్తి చూపాలంటే రండి.. ఏదన్నా ఛానెల్‌లో కూర్చుందాం.. అంత దమ్ము మీకు వుండదు. చీకట్లో తిరిగే పిల్లులు మీరు అని కడిగి పారేస్తుందట సన్నీలియోన్‌. తెలుగులో ఓ సామెత వుంది, ఎదుటావిడ పతిత అంటే, రెండో ఆవిడ లక్ష్మీదేవి అంటుందా? అని. అలా వుంది ఈ సెక్సీ భామల గొడవ.