చిరు సరసన ఎవరు?

చిరంజీవి 150 వ సినిమాకు కథ ఎంత కష్టమైందో, ఇప్పుడు హీరోయిన్ ఎంపిక కూడా  అంతే కష్టం. మరీ యంగ్ గాళ్స్ చిరు పక్కన నప్పరు. గతంలో త్రిష ఆయన పక్కన నటించినపుడే కాస్త…

చిరంజీవి 150 వ సినిమాకు కథ ఎంత కష్టమైందో, ఇప్పుడు హీరోయిన్ ఎంపిక కూడా  అంతే కష్టం. మరీ యంగ్ గాళ్స్ చిరు పక్కన నప్పరు. గతంలో త్రిష ఆయన పక్కన నటించినపుడే కాస్త ఇబ్బందిగా కనిపించింది. ఇప్పుడున్న వాళ్లలో నయనతార కొంత వరకు సూటబుల్. కానీ దర్శకుడు పూరికి అలాంటి వాళ్లు ఆనరు. సమంత, అనుష్క కొంత వరకు ఓకె. 

అయితే అనుష్క ఇప్పుడు బిజీగా వుంది. పైగా పెళ్లి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సమంత తెలుగు ఇన్నింగ్స్ దాదాపు కొసకు వస్తున్నాయి. కానీ లక్కీగా చైతన్య పక్కన, మహేష్ పక్కన చాన్స్ లు వచ్చాయి. ఇలాంటపుడు చిరు పక్కన ఓకె అంటుందా అన్నది చూడాలి. పూరి హాట్ ఫేవరెట్ చార్మి వుండనే వుంది. జ్యోతిలక్ష్మి హిట్ అయితే చార్మికి మళ్లీ ఊపు వస్తుంది. 

చిరు సినిమాలో ఒకటి కన్నా ఎక్కువ హీరోయిన్ పాత్రలు వుంటే చార్మి కచ్చితంగా ఒక చాయిస్ అవుతుంది. మిగిలిన వారు చాలా మంది చిరు సరసన మెయిన్ హీరోయిన్ లుగా నటించినవారే. ఇక కాదంటే బాలీవుడ్ నుంచి ఎవర్నయినా దిగుమతి చేసుకోవాలి. అలాంటి సెలక్షన్ లో దర్శకుడు పూరిది అందెవేసిన చేయి. ఎవర్నో ఒకర్ని బానే సెట్ చేస్తాడు. లెటజ్ వెయిట్ అండ్ సీ.