ఆటో నగర్ సూర్య సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మొన్నటి వరకూ ఫైనాన్స్ సమస్యతో ఆగిపోయిన ఆటో…. ఎట్టకేలకు కదిలింది. నాగ్ ఫ్యాన్స్ లోనూ హుషారొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ ఆటోకు సమస్యలు మొదలయ్యాయి. రిలీజ్ డేట్‌ని పలుమార్లు వాయిదా వేసుకొన్న ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది.
ఈనెల 31న రావల్సిన సూర్య, మరో వారం వెనక్కి వెళ్లాడు. అప్పుడు కూడా ఈ సినిమా రావడం డౌటేనని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకి ఉన్న ఫైనాన్స్ సమస్య ఇంకా క్లియర్ కాలేదని, అది అయ్యే ఛాన్స్ అంతంత మాత్రమేనని తెలుస్తోంది. ఒకవేళ ఆడియో విడుదలైనా, సినిమాని తీసుకొచ్చేది అనుమానమేనట. నాగార్జున ఈ విషయంలో జోక్యం చేసుకొంటారని ఇప్పటి వరకూ అచ్చిరెడ్డి, ఆర్. వెంకట్ ఎదురు చూశారు.
కానీ నాగ్ కూడా చేతులెత్తేసేసరికి ఈ సినిమా చిక్కులు అలాగే ఉండిపోయాయి. అందుకే 31న సూర్యని విడుదల చేయలేకపోతున్నారు. మరో వారంలోగా ఈ సమస్య తీరిపోతుందా? లేదంటే… ఇలా వాయిదాల పర్వం కొనసాగుతుందా?? అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. నిర్మాతలు మాత్రం, థియేటర్లు అందుబాటులో లేకే.. ఈ సినిమా ఆలస్యం అయ్యిందని, ఈసారి డేటు తప్పదని భరోసా ఇస్తున్నారు. ఎవరి మాట చెల్లుబడి అవుతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.