మ‌హేష్ సినిమాలో నాగ్ లేడట‌!

టాలీవుడ్‌లో మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆశ‌లు పూర్తిగా చిగురించ‌కుండానే… తొలి అవ‌రోధం వ‌చ్చేసింది. మ‌ణిర‌త్నం త్వ‌ర‌లోనే నాగార్జున‌, మ‌హేష్ బాబుల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడ‌ని, క‌థ కూడా రెడీ అయ్యింద‌ని రెండ్రోజుల నుంచీ మీడియాలో…

టాలీవుడ్‌లో మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆశ‌లు పూర్తిగా చిగురించ‌కుండానే… తొలి అవ‌రోధం వ‌చ్చేసింది. మ‌ణిర‌త్నం త్వ‌ర‌లోనే నాగార్జున‌, మ‌హేష్ బాబుల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడ‌ని, క‌థ కూడా రెడీ అయ్యింద‌ని రెండ్రోజుల నుంచీ మీడియాలో వార్తా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అటు ప్రిన్స్ ఫ్యాన్స్, ఇటు నాగ్ గ్యాంగ్‌… ఈ సినిమా గురించి ఆసక్తిగా మాట్లాడుకొంటున్నారు. 

అయితే… అంత‌లోనే ఈ సినిమా గురించిన ఓ విష‌యం తెలిసింది. అదేమిటంటే…  ఈ సినిమాలో నాగార్జున లేడ‌ట‌. మ‌హేష్ – మ‌ణి కాంబినేష‌న్ నిజ‌మేగానీ, ఈ క‌థ‌లో  మ‌రో హీరోకి ఛాన్స్ లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. 

ఇది సోలో హీరో సినిమానేన‌ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నార‌ని టాక్‌. త‌మిళంలో విజ‌య్, తెలుగులో మ‌హేష్ న‌టించ‌నున్నారు. ఈ వేస‌విలోగా ఈ సినిమా గురించిన పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.