పోకిరి 2.. ఎప్పుడు?

పూరి జ‌గ‌న్నాథ్ స్టామినానీ, మ‌హేష్ బాబు కెపాసిటీనీ చాటిచెప్పిన చిత్రం పోకిరి. తెలుగు సినిమా వ‌సూళ్ల స‌త్తా.. ఈ సినిమాతోనే తెలిసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ క‌థ రాసే ప‌నిలో పూరి ఉన్నాడా??…

పూరి జ‌గ‌న్నాథ్ స్టామినానీ, మ‌హేష్ బాబు కెపాసిటీనీ చాటిచెప్పిన చిత్రం పోకిరి. తెలుగు సినిమా వ‌సూళ్ల స‌త్తా.. ఈ సినిమాతోనే తెలిసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ క‌థ రాసే ప‌నిలో పూరి ఉన్నాడా??  అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. 

మ‌హేష్ – పూరి క‌ల‌యిక‌లో మూడో సినిమా ఎప్పుడో మొద‌లు కావ‌ల్సివుంది. బిజినెస్ మేన్ అవ్వగానే హ్యాట్రిక్ ప్రోజెక్ట్ మొద‌ల‌వ్వాలి. కానీ మ‌హేష్‌కి ఉన్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మూడోసారి ఈ కాంబినేష‌న్ చూసే అవ‌కాశం ద‌క్కుతోంది. అదీ… పోకిరి క‌థ‌తో!  పోకిరి 2 చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న అప్పుడెప్పుడో పూరికి వ‌చ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. 

ఇప్పుడు మ‌హేష్ ఈ క‌థ‌పై ఆస‌క్తి చూపిస్తున్నట్టు సమాచార‌మ్‌. ఇటీవ‌ల పూరి, మ‌హేష్ ఈ సినిమా గురించి మాట్లాడుకొన్నార‌ని తెలిసింది. మ‌హేష్ కూడా పోకిరి 2 చేస్తే బాగుంటుంద‌ని పూరికి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. మ‌హేష్ అడిగిందే త‌డువు… పూరి కూడా ఈ సినిమాపై ఇప్పుడు దృష్టి పెట్టాడు. మ‌హేష్ ఒప్పుకొన్న ప్రాజెక్టుల‌న్నీ ఒకొక్కటీ కొలిక్కి వ‌స్తున్నాయి. ఈలోగా పూరి కూడా క‌థ రెడీ చేస్తే…. తెలుగు తెర‌పై పండుగాడు మ‌రోసారి విజృంభించే ఛాన్స్ ఉంది.