అప్పుడెప్పుడో వచ్చింది రవితేజ నా ఆటోగ్రాఫ్. ఓ వ్యక్తి జీవితంలో తారసపడిన అమ్మాయిలతో సాగిన కథనం. ఆ మధ్య నాగ్ చైతన్య ప్రేమమ్ సినిమా కూడా వచ్చింది. వివిధ వయసుల్లో వేరే వేరే అమ్మాయిలతో ప్రేమాయణం కాన్సెప్ట్ తో. అలాగే నలుగురు హీరోయిన్లు,నాలుగు ప్రేమ కథలు అంటూ క్రాంతి మాధవ్ కూడా ఓ సినిమాను విజయ్ దేవరకొండ తో చేయబోతున్నారు.
అయితే వీటికి కొంచెం భిన్నంగా ఓ వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో ఒకే అమ్మాయితో బంధం ఎలా బలపడిందీ, ఎలా ఫ్రేమగా మారిందీ, ఎలా పెళ్లికి దారితీసిందీ అనే లైన్ తో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఓ సినిమాను చేయబోతున్నారు. అవసరాల సినిమాలో ఒకే హీరోయిన్ వుంటుంది. పైన చెప్పుకున్న సినిమాల్లో వేరు వేరు హీరోయిన్లు వుండరు.
కానీ హీరో మాత్రం వివిధ వయసుల్లో కనిపిస్తాడన్నమాట. ఈ సినిమాకు నాగశౌర్య హీరో. సినిమా అమెరికా బ్యాక్ డ్రాప్ కూడా కొంత వుంటుంది. ఈ సినిమాలో ఇండియాలో తీయాల్సింది తీసేసారు. అమెరికా వర్క్ వుండిపోయింది. అది ఫినిష్ అయితే విడుదలకు రెడీ అవుతుంది.