అవసరాల కేరాఫ్ బుల్లితెర

సినిమా నటులంతా ఇప్పుడు బుల్లితెర వైపు చూస్తున్నారు. బుల్లి తెర షోలకు క్రేజ్ రాను రాను పెరుగుతుండడం, అదీ గాక సినిమా జనాలైతే రేటింగ్ పెరగడం వంటి కారణాలతో ఈ తరహా షోలు పెరుగుతున్నాయి. …

సినిమా నటులంతా ఇప్పుడు బుల్లితెర వైపు చూస్తున్నారు. బుల్లి తెర షోలకు క్రేజ్ రాను రాను పెరుగుతుండడం, అదీ గాక సినిమా జనాలైతే రేటింగ్ పెరగడం వంటి కారణాలతో ఈ తరహా షోలు పెరుగుతున్నాయి. 

ఈ మార్కెట్ ముందుగా అందుకున్నది హాస్య నటుడు ఆలీ. దాదాపు అన్ని లీడింగ్ చానెళ్లలో ఆయన కార్యక్రమాలు వున్నాయి. మిగిలిన వారు కూడా ఆలీ ని ఫాలోఅయిపోతున్నారు. 

అష్టా చెమ్మాతో నటుడిగా, ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న అవసరాల శ్రీనివాస్ కూడా ఓ షో నిర్వహిస్తున్నారు. ఈ షో ఈటీవీలో త్వరలో ప్రారంభమవుతుంది. చాంపియన్ పేరిట గతంలో వున్న షోనే, మార్చి కొత్తగా శ్రీను అవసరాలతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది.