కత్తి సినిమా ఏ ముహూర్తాన తీసుకున్నారో కానీ, డబ్బింగ్ వెర్షన్ విడుదల చేయడమే కుదరడం లేదు. ఇంక ఈ సీజన్ లో విడుదల చేయాలంటే, మూడు వారాల సమయం మాత్రం వుంది. ఆపై డైరక్ట్ పెద్ద సినిమాల వెల్లువ స్టార్ట్ అవుతుంది. ప్రారంభంలో పవన్ తో చేస్తే ఎలా వుంటుంది అని కిందా మీదా పడ్డారు.
ఆఖరికి పవన్ఎందుకనో 'నో' అన్నారు. ఆ సినిమాలో సబ్జెక్ట్ అంతా పచ్చటి పొలాలు, సెజ్ లు వంటి వ్యవహారాలతో నిండి వుండడంతో, అధికారపార్టీ మిత్రుడిగా వుంటూ ఆ సినిమా చేయడం ఎందుకని ఆగాడు పవన్ అన్న వార్తలు వినిపించాయి. అయితే సినిమా గురించి తెలుసుకుని, బన్నీ ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నాడని మరో టాక్. కాస్త ఆగితే తాను ఆ సినిమా చేస్తానని నిర్మాతకు బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది.
ఠాగూర్ మధు మెగా క్యాంప్ అంతటికీ సన్నిహితుడే. అందువల్ల బన్నీ కచ్చితంగా చేస్తాను అంటే, డబ్బింగ్ వెర్షన్ మూల పడేయాలనుకుంటున్నాడు. లేదంటే, ఈ మూడు వారాల్లో మరీ సోలో స్లాట్ కాకున్నా, కాస్త పోటీ తక్కువ వున్న టైమ్ చూసి వదిలేయాలనుకుంటున్నారు. చూడాలి బన్నీ ఏం నిర్ణయం తీసుకుంటాడో?