శంకర్-విక్రమ్ విజువల్ ట్రీట్ ఐ (మనోహరుడు) సంక్రాంతికి రావడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా పనులు ఇంకా జరగుతుండడమే ఇందుకు కారణం. ఎలాగైనా తెలుగు, తమిళ ఫ్రాంతాల్లో సంక్రాంతి సీజన్ కు చాలా ప్రాధాన్యత వుంటుంది కాబట్టి, సినిమాను విడుదలచేయాలని శంకర్ ప్రయత్నిస్తున్నారట.
అయితే ఏదో కిందా మీదా పడి తమిళంలో విడుదల చేసినా,తెలుగులో సంక్రాంతికి వుండే అవకాశం కనిపించడం లేదు. తెలుగులో చాలా పెద్ద సినిమాలు విడుదల అవుతుండడం ముఖ్యమైన కారణం. పైగా ఈ సినిమా హక్కులను చాలా భారీ టెర్మ్స్ అండ్ కండిషన్ల నడుమ ఆర్ బి చౌదరి స్వంతం చేసుకున్నారు.
దాదాపు నలబై కోట్ల షేర్ వస్తే తప్ప, ముందు ఆయన గట్టెక్కరు. పైగా ఇంకా ఇప్పటి వరకు అడియో ఫంక్షన్ కూడా జరగలేదు. సమయం కేవలం ఒక నెల మాత్రమే వుంది. అందువల్ల ఏదో కిందామీద పడి తమిళంలో విడుదలైనా తెలుగులోకి మాత్రం రానట్లే.