అవసరాలకు ప్రాజెక్టు సెట్ అయింది

దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కు మొత్తానికి ఓ ప్రాజెక్టు సెట్ అయింది. చిరకాలంగా ఆయన ఇదే ప్రయత్నాల్లో వున్నారు. తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత సాయి కొర్రపాటి దగ్గరే ఓ సినిమా చేయాల్సి…

దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కు మొత్తానికి ఓ ప్రాజెక్టు సెట్ అయింది. చిరకాలంగా ఆయన ఇదే ప్రయత్నాల్లో వున్నారు. తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత సాయి కొర్రపాటి దగ్గరే ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ అక్కడ పాజిబుల్ కాలేదు. ప్రస్తుతం ఆయన చేసే స్టేజ్ లో లేదు. దాంతో అక్కడి నుంచి హారిక హాసినికి వచ్చారు. కొన్నాళ్లు అక్కడ కథ డెవలప్ చేసే పనిలో పడ్డారు. కానీ కథ అక్కడ వారికి నచ్చలేదు.

దాంతో ఆ కథతో స్వప్న సినిమా స్వప్నదత్ దగ్గరకు వెళ్లారని వార్తలు వచ్చాయి. మరి ఏమయిందో? అక్కడ నుంచి ఇప్పుడు పీపుల్స్ మీడియా దగ్గరకు వెళ్లారు. అక్కడ ప్రాజెక్టు సెట్ అయినట్లే కనిపిస్తోంది. హీరో కూడా దొరికాడు. అవసరాల మాదిరిగా కొంత కాలంగా ఖాళీగా వున్న నాగశౌర్యను హీరోగా ఎంచుకున్నారు.

ఆ విధంగా ప్రాజెక్టు సెట్ అయినట్లే అనుకోవాలి. కానీ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అన్నదే తెలియదు. ఎందుకంటే నాగశౌర్య ఈ సినిమాకన్నా ముందు సుకుమార్ రైటింగ్స్ లో ఓ సినిమా చేయాలి. ఆ సినిమాలో నాగశౌర్య రెండు మూడు గెటప్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఆ గెటప్ లు, గెడ్డాలు అన్నీ పూర్తి చేసుకుని, రావాలంటే టైమ్ పడుతుంది. పైగా నిర్మాతలు పీపుల్స్ మీడియా కూడా వెంకీ-చైతన్య సినిమాకు ప్రయారిటీ ఇస్తాయి. అందువల్ల ఈ కూడికలు తీసివేతలు అన్నీ లెక్కలు వేసుకుంటే అవసరాల ప్రాజెక్టు స్టార్ట్ కావడానికి కనీసం ఇంకో ఆరు నెలలు అయినా పడుతుందేమో?

NTR పరువు తీసింది చంద్రబాబా? దగ్గుబాటా?