Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గీతాలో బోయపాటి సినిమా క్యాన్సిల్?

గీతాలో బోయపాటి సినిమా క్యాన్సిల్?

సరైనోడు తరువాత నుంచి వినిపిస్తున్న విషయం ఒకటి వుంది. గీతాఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా వుంటుందన్నది ఆ సంగతి. అయితే అల్లు అరవింద్ ఇప్పుడు ఆ ఆలోచన నుంచి డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన వినయ విధేయరామ సినిమా చూసిన వెంటనే అల్లు అరవింద్ తొలి రియాక్షన్ ఇదే అని తెలుస్తోంది. 'అబ్బే చిరంజీవి గారితో బోయపాటి లాభంలేదు' అని ఆయన తన పక్కన వున్నవారితో కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.

దీనికితోడు ఇప్పుడు రామ్ చరణ్ పూర్తిగా బోయపాటికి వ్యతిరేకంగా వున్నారు. అందువల్ల చరణ్ ను కాదని ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఇక మిగిలిన ఆప్షన్ ఒక్కటే గీతా బ్యానర్ లో మళ్లీ బన్నీతో సినిమా చేయడం. కానీ బన్నీ కూడా బోయపాటితో చేయడానికి అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి బోయపాటికి సినిమా సమస్య లేదు. ఎందుకంటే బాలయ్యతో సినిమా వుంది. ఆ సినిమాకు బోయపాటి 70 కోట్ల బడ్జెట్ చెప్పినట్లు టాక్. దాంతో బాలయ్య అసలు అంత బడ్జెట్ డిమాండ్ చేసే కథ ఏమిటో, ఫుల్ నెరేషన్ ఇవ్వమని కోరినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మొత్తానికి ఇండస్ట్రీ డైరక్టర్లలో టాప్ లైన్లో వుండాల్సిన ప్లేస్ ను బోయపాటి ఒక్క సినిమాతో పోగొట్టుకున్నట్లు అనిపిస్తోంది.

NTR పరువు తీసింది చంద్రబాబా? దగ్గుబాటా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?