‘అవసరాల’ తో నాని?

అవసరాల శ్రీనివాస్-నాని అనగానే అష్టాచెమ్మా గుర్తుకు వస్తుంది. ఆ ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమా. ఇప్పటికీ ఫన్ అంటే జనాలకు ఆ సినిమా కళ్ల ముందుకు వస్తుంది. అయితే అది వారికి తొలి…

అవసరాల శ్రీనివాస్-నాని అనగానే అష్టాచెమ్మా గుర్తుకు వస్తుంది. ఆ ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమా. ఇప్పటికీ ఫన్ అంటే జనాలకు ఆ సినిమా కళ్ల ముందుకు వస్తుంది. అయితే అది వారికి తొలి సినిమా. ఇప్పుడు నాని ఓ రేంజ్ హీరోగా ఎదిగాడు. అవసరాల కాస్త డిఫరెంట్ డైరక్టర్ గా ప్రూవ్ చేసుకునే పనిలో వున్నారు. 

ఇప్పటికే రెండు సినిమాలు ఫినిష్ చేసి, మూడో సినిమా చకచకా కానిచ్చేస్తున్నారు. నాలుగో సినిమాకు కూడా సబ్జెక్ట్ రెడీ చేసేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నాని హీరోగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చేస్తున్న రీమేక్ తరువాత ఈ సినిమా తెరకెక్కే అవకాశం వుంది.

ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్త నిర్మించే అవకాశం వుంది. నాని అంటేనే ఓ డిఫరెంట్ సినిమా అని పేరు వుంది. అవసరాలకు అదే పేరు. మరి ఇద్దరి కాంబినేషన్ కలిస్తే ఆ కిక్కే వేరుగా వుంటుంది.