ఆవిడ కూడా సిగ్గు పడిందంటే ఆ రేంజ్‌లో ఉంది ప్రోగ్రాం

విలువలూ, సంబంధాలూ మంటగలిసిపోయినా ఫర్వాలేదు. అసభ్యత, ఎగతాలి ఎక్కువయినా ఫర్వాలేదు. బూతులు ఇష్టం వచ్చినట్లు ప్రయోగించినా ఫర్వాలేదు కానీ ప్రోగ్రాం చూస్తే నవ్వు రావాలి అన్నట్లుగా ఉంది ఈటీవి జబర్థస్త్‌ తీరు. ఈ విషయంలో…

విలువలూ, సంబంధాలూ మంటగలిసిపోయినా ఫర్వాలేదు. అసభ్యత, ఎగతాలి ఎక్కువయినా ఫర్వాలేదు. బూతులు ఇష్టం వచ్చినట్లు ప్రయోగించినా ఫర్వాలేదు కానీ ప్రోగ్రాం చూస్తే నవ్వు రావాలి అన్నట్లుగా ఉంది ఈటీవి జబర్థస్త్‌ తీరు. ఈ విషయంలో రామోజీరావు లౌక్యాన్ని మెచ్చుకొని తీరాలి. ‘జబర్దస్త్‌’ లో బూతులు కొత్త కాదు. అయితే అవి జడ్జిగా వస్తున్న రోజా కూడా రెండు చేతులతో మొహం కప్పుకుంటుందంటే అవి ఏ రేంజ్‌లో ఉంటున్నాయో అర్ధం  చేసుకోవచ్చు. 

ఒక స్కిట్‌లో ఒకడు తన ప్రేయసి ముందు వేళ్లు లెక్కపెట్టుకుని పది అంటాడు. అలా పైకి లెక్క పెట్టకూడదు. జేబులో చేతులు పెట్టుకుని లెక్కపెట్టు అంటుంది ప్రేయసి జేబులో చేతులు పెట్టి లెక్కపెట్టి పదకొండు అంటాడు. అంటే అక్కడ ఒకటేదో ఎక్స్‌ట్రా ఉంది. దాంతో రోజా కూడా ఆ బూతుకు సిగ్గు పడి చేతులతో మొహం కప్పుకుని ఏడ్వలేక నవ్వేసింది. 

ఇలాంటి బూతుతో ఆంధ్ర, తెలంగాణా ప్రజలు హాస్యం పేరిట తరించిపోతుంటే ఈ టీవీ వాళ్లు కేవలం ఇలాంటి హాస్యం, నిరంతరం అందించడానికి ఇంకో ఛానెల్‌ పెడుతున్నారట. ఇంకేం మన తెలుగు వాళ్లు పచ్చి బూతు ప్రోగ్రాంస్‌తో పండిపోతారు. గతంలో తోలుబొమ్మలాటలోనో, దొమ్మరిసారి ఆటల్లోనో కనిపించిన బూతు ఇప్పుడు టీవీల్లో ఇంటిల్లిపాదినీ ఆహ్లాదపరచడం విచారకరం. తప్పదు.. డబ్బులొచ్చే  ఏ పనినీ ఆ టీవీ వాళ్లు వదులుకోరు మరి.