నవతరం కథానాయికల్లో జోరు చూపిస్తోన్న భామ రాశీఖన్నా. ఈ సీజన్లో రకుల్‌ప్రీత్ సింగ్‌కి పోటీ ఎవరంటే.. రాశీ పేరే చెబుతున్నారంతా. అయితే రాశీని దాటుకొంటూ రకుల్ భారీ అవకాశాల్ని చేజిక్కించుకొంటోంది. ఎలాగైనా రకుల్‌ని బీటవుట్ చేయాలి అనుకొందో ఏమో.. ఇప్పుడు రాశీఖన్నా కొత్తగా కసరత్తులు ప్రారంభించేసింది.
రాశీ కాస్త బొద్దుగా ముద్దుగా ఉండేది కాదా, ఏకంగా ఆరు కిలోలు తగ్గి కొత్తగా కనిపిస్తోందిప్పుడు. హరిద్వార్‌లోని ఓ స్పాలో రెండు వారాల పాటు శ్రమించి ఆరుకిలోలు తగ్గిందట. ప్రతీరోజూ జిమ్, యోగా కోసం రెండుగంటల పాటు సమయాన్ని కేటాయిస్తోందట.
''లావుగా ఉన్నావ్ కాస్త తగ్గు అని ఎవరూ సలహా ఇవ్వలేదు. అలాంటి మాటలు వినకూడదనే నాఅంతట నేను బరువు తగ్గా..'' అని చెప్తోంది రాశీ.