పూరీ..ఇది టూ మచ్ గా లేదూ

పూరి జగన్నాధ్ స్టయిలే వేరు. ఏం చేసినా కాస్త ఎక్కువే వుంటుంది. జ్యోతిలక్ష్మి అడియో ఫంక్షన్ లో ఆయనకు సన్మానం, జయ జయ ధ్వానాలు, పూల కిరీటం, భారీ దండలు అన్నీ కాస్త అతిగాఅనిపించాయి…

పూరి జగన్నాధ్ స్టయిలే వేరు. ఏం చేసినా కాస్త ఎక్కువే వుంటుంది. జ్యోతిలక్ష్మి అడియో ఫంక్షన్ లో ఆయనకు సన్మానం, జయ జయ ధ్వానాలు, పూల కిరీటం, భారీ దండలు అన్నీ కాస్త అతిగాఅనిపించాయి ఆడియన్స్ కు. చార్మికి, సినిమా టీమ్ కు పూరి మీద అభిమానం వుంటే వుండొచ్చు. 

అది సినిమా హిట్ అయిన తరువాత కేవలం అందుకోసం సమావేశం ఏర్పాటు చేసి, హడావుడి చేస్తే వేరు. అడియో ఫంక్షన్ లో కేవలం పూరికి సన్మానం చేసేందకు చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. 

ఆడిటోరియం అంతా టపాసుల మోత, భారీ దండలు, పూల కిరీటంతో పాటు అభిమానులు చుట్టూ చేరి పూలు జల్లడం, అక్కడితో ఆగకుండా జై జై అంటూ అరుపులు ఓహో…ఒకటేమిటి..చాలా వుంది. జగన్నాధ్ రథాయాత్ర ఇంకాఒకటి రెండు వారాలు ముందు వుంది. కానీ జై జగన్నాథ్ అంటూ నినాదాలు మాత్రం నిన్ననే తెగ వినిపించేసాయి.