కళాతపస్వి కే విశ్వనాధ్..అపారమైన గౌరవ ప్రతిష్టలున్న వ్యక్తి. కాస్త నిబద్దత వున్న వ్యక్తి. ఇప్పుడు ఆయనపై ఓ గ్యాసిప్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. త్రివిక్రమ్ అ..ఆ..సినిమాకు ఆయనను తీసుకోవాలని అనుకున్నారట,.సరే డేట్లు, రేటు అడిగారట. రోజుకు లక్ష రూపాయిలు అన్నారట. ఆ తరువాత త్రివిక్రమ్ వెళ్లి కథ, పాత్ర వగైరా చెప్పి వచ్చారట.
ఆ మర్నాడో, తరువాతో యూనిట్ తరపున అగ్రిమెంట్ కు వెళ్తే, విశ్వనాధ్ మేనేజర్ రోజుకు రెండు లక్షలు అన్నారట. అదేంటీ..అంటే రెండు లక్షలయితే ఓకె లేకుంటే లేదు అన్నారట. యూనిట్ జనాలు చేసేది లేక ఒకె అన్నారనుకోండి. అది వేరే విషయం. కానీ విశ్వనాధ్ లాంటి పెద్దాయిన కూడా ఇలా గడీకో మాట చెప్పడం సరికాదు కదా అన్న విమర్శలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.