అవునా ప్రభాస్‌.. ఇది నిజమేనా.?

నవంబర్‌లో 'బాహుబలి – కంక్లూజన్‌' సినిమా షూటింగ్‌ పూర్తయిపోతుంది. ఇక, ఆ తర్వాత ప్రభాస్‌ పూర్తిగా ఖాళీ అయిపోయినట్లే. ఖాళీ అవడమంటే, దాదాపు నాలుగేళ్ళపాటు ప్రభాస్‌, 'బాహుబలి'తో లాక్‌ అయిపోయాడు. వేరే సినిమాలు చేయడానికి…

నవంబర్‌లో 'బాహుబలి – కంక్లూజన్‌' సినిమా షూటింగ్‌ పూర్తయిపోతుంది. ఇక, ఆ తర్వాత ప్రభాస్‌ పూర్తిగా ఖాళీ అయిపోయినట్లే. ఖాళీ అవడమంటే, దాదాపు నాలుగేళ్ళపాటు ప్రభాస్‌, 'బాహుబలి'తో లాక్‌ అయిపోయాడు. వేరే సినిమాలు చేయడానికి వీలు కుదరక ఖాళీగానే వుండాల్సి వచ్చింది. 'బహుబలి' షూటింగ్‌ పూర్తయిపోగానే, చేయాల్సిన రెండు సినిమాలపై ఇప్పటికే ప్రభాస్‌కి పూర్తి క్లారిటీ వుంది. అందులో ఒకటి 'రన్ రాజా రన్' ఫేం సుజిత్‌ డైరెక్షన్‌లో చేసే సినిమా ముందు పట్టాలెక్కనుంది. 

'బాహుబలి' షూటింగ్‌ పూర్తయిన వెంటనే, సుజిత్‌ సినిమాని పట్టాలెక్కించేయనున్న ప్రభాస్‌, వీలైనంత త్వరగా ఆ సినిమాని కంప్లీట్‌ చేసెయ్యాలనే ఆలోచనతో వున్నాడట. 'బాహుబలి' ఎటూ సమ్మర్‌కిగానీ ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్‌ లేదు. ఈలోగా సుజిత్‌ డైరెక్షన్‌లో చేసే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తే ఎలా వుంటుంది.? అన్న విషయమై ప్రభాస్‌ కిందా మీదా పడ్తున్నాడన్నది టాలీవుడ్‌లో విన్పిస్తోన్న హాటెస్ట్‌ గాసిప్‌. 

అయితే, 'బాహుబలి' ప్రభాస్‌తో వచ్చిన అవకాశాన్ని సుజిత్‌ అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. 'బాహుబలి'తో పోల్చడానికి వీల్లేకపోయినా, ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకునే సుజిత్‌ తనకు ప్రభాస్‌తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాడు. సో, 'బాహుబలి' విడుదలయ్యేలోపు ప్రభాస్‌ – సుజిత్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. మరి, ఈ గాసిప్‌ ఎందుకు పుట్టిందట.? నిప్పు లేకుండా పొగరాదు.. అనుకోవాలా.? ప్రభాస్‌ స్పందించాల్సిందే.