పూరి జగన్నాధ్. చకచకా సినిమాలు చేసేస్తాడని పేరు. కానీ సరైన హిట్ లు మాత్రం రావడం లేదు. రోగ్ సినిమా ప్రారంభించాడు. నిర్మాతతో డబ్బుల లెక్కలు తేడా కొట్టాయని వినికిడి. నిజమో, అబద్దమో, మొత్తానికి సినిమా అయితే అలా అతీగతీ లేకుండా వుంది. ఇజమ్ మొదలయింది. 26 కోట్ల ఖర్చు. విడుదల కావాలి. అలా విడుదల కావాలంటే భారీ రేట్లకు బయ్యర్లు కళ్యాణ్ రామ్-పూరి సినిమాను కొనే ధైర్యం చేయాలి.
ఇదిలా వుంటే, గతంలో పూరి ఓ నిర్మాత కోసం సినిమా చేస్తా అని ఓకె అన్నాడట. తనకు అర్జెంట్ అవసరం పడిందని రెండు కోట్లు అడ్వాన్స్ ఇమ్మన్నాడట. దాంతో ఓ చాలా అంటే చాలా పెద్దాయిన ద్వారా ఈ నిర్మాత పూరికి అడ్వాన్స్ అందించాడట. కానీ ఇప్పుడు సినిమా అంటే, పూరి మొహం చాటేస్తున్నాడని వినికిడి.
మధ్యలో డబ్బు సర్దుబాటు చేసిన పెద్దాయిన ఫోన్ చేసినా పూరి దొరకడం లేదని తెలుస్తోంది. దాంతో సదరు పెద్దాయిన పూరి పై చాలా గుర్రుగా వున్నాడట. నిర్మాత సంగతి సరే, తనకు అయినా మర్యాద ఇవ్వాలి కదా అని ఆ పెద్దాయిన కాస్త ఆగ్రహంతోనే వున్నాడట. ఆ పెద్దాయినకు మీడియా మీద కాస్త గట్టిపట్టే వుంది. మరి ఇవన్నీ కలిసి పూరి ఇజమ్ సినిమా ఏ మాత్రం తేడా చేసినా, ఓ రేంజ్ లో ఆడేసుకునే పరిస్థితి వుంది.
ఈ సినిమా తేడా వస్తే, ఇక మహేషూ లేదు..ఎన్టీఆరూ లేదు..నాగశౌర్య లాంటి చిన్న హీరోలతో సినిమాలు చేసకోవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో కూడా పూరి ఇలా వుండడం ఏమిటో మరి?