సినిమా వాళ్ళల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది మురళీమోహన్. ఈయన చంద్రబాబు హయాంలో భారీ స్థాయిలో వ్యాపారం చేశాడు. ఈయన కంటే ముందు ముత్యాల ముగ్గు హీరో శ్రీధర్ కూడా హైద్రాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడట.
బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాలముగ్గు’ సినిమా శ్రీధర్‌కు గొప్ప సినిమా. ఆ తర్వాత ఎన్నో పాత్రలు పోషించినా ప్రేక్షకుల్లో అంత ఆకర్షణ, ఆదరణ పొందలేకపోయాడు. ఎక్కువగా మద్రాస్‌లో వుండి, తర్వాత హైద్రాబాద్‌కి షిఫ్ట్ అయ్యాడు. మద్యపానం అలవాటు బాగా వున్న శ్రీధర్ అప్పటి ఫిలిం క్లబ్‌లో తోటి నటీనటులైన ప్రభాకర్‌రెడ్డి, సారధి, గిరిబాబులతో గడిపేవాడట.
మురళీమోహన్‌కి ప్రభుత్వం ఎక్కడ డెవలప్‌మెంట్ చేస్తుందో ముందుగా లీకులు అందేవి. దాంతో ఆయన పెట్టుబడి సేఫ్‌గా వుండేది. అలాంటి నెట్ వర్క్ లేని శ్రీధర్ ఏవో భూములు కొని నష్టపోయాడంటారు. ‘ముత్యాలముగ్గు’ లాంటి క్లాసిక్‌లో నటించినా ఇప్పటి వార్తల్లో కూడా గుర్తింపుకు నోచుకోని శ్రీధర్ దురృష్టవంతుడు.