అయిదుకోట్లకు..అయిదేళ్లకు వడ్డీ ఎంతో?

టాలీవుడ్ లో వడ్డీరేట్లు తక్కువేమీ కాదు. మూడు రూపాయిల నుంచి అవసరమైతే పది రూపాయిల వరకు కూడా వుంటుంది. అయిదు కోట్లకు నెలకు మూడు రూపాయిలు చూసుకున్నా నెలకు లక్షన్నర వడ్డీనే. అలాంటిది అయిదేళ్లకు…

టాలీవుడ్ లో వడ్డీరేట్లు తక్కువేమీ కాదు. మూడు రూపాయిల నుంచి అవసరమైతే పది రూపాయిల వరకు కూడా వుంటుంది. అయిదు కోట్లకు నెలకు మూడు రూపాయిలు చూసుకున్నా నెలకు లక్షన్నర వడ్డీనే. అలాంటిది అయిదేళ్లకు అంటే..దగ్గర దగ్గర కోటి రూపాయిలు. ఇలాగే లెక్కలేసుకుంటూ బాధపడుతున్నాడట ఓ పెద్ద నిర్మాత.

ఒకప్పుడు మంచి సినిమాలు తీసి, విజయవంతమైన నిర్మాత అనిపించుకుని, టైమ్ బాగాలేక, ఫ్లాప్ లతో ఇబ్బంది పడ్డారా నిర్మాత. దాంతో మరి పెద్దహీరోలు ఆయన పెద్దరికానికి, పెద్ద వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారు.

అప్పట్లో ఓ పెద్ద హీరోకు అయిదుకోట్లు అడ్వాన్స్ ఇచ్చాడట ఆయన. డేట్ల కోసం ఇప్పటికీ అప్పుడప్పుడు కనిపించి, నమస్కారం పెట్టివస్తున్నాడట. అయినా డేట్లు ఎప్పుడిస్తారో తెలియదు. కొత్త కొత్త నిర్మాతలతో సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడా హీరో. మరి ఈ సీనియర్ నిర్మాతను ఎప్పుడు కరుణిస్తాడో?