బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల చిత్రీకరణ హడావుడిగా పూర్తి చేస్తే డిసెంబర్‌లో సినిమా వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ ‘ఆటోనగర్ సూర్య’ అప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. ఆడియో రిలీజ్ చేసేసి, అదే వేదికపై ఫిబ్రవరి 7న రిలీజ్ అని ప్రకటిస్తే ఇక ఈ చిత్రం రావడం ఖాయమని అనుకున్నారు.
కానీ ఫిబ్రవరి 7న మాత్రం ‘ఆటోనగర్ సూర్య’ రిలీజ్ కావడం లేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 27న మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ అయ్యే అవకాశముందనేది లేటెస్ట్ రిపోర్ట్. ఇంకా అధికారికంగా సినిమా వాయిదా వేసిన విషయాన్ని నిర్మాతలు ప్రకటించలేదు.
అయితే ఇదే బ్యానర్‌పై తెరకెక్కి, చాలా కాలంగా విడుదల కాకుండా ఆగిపోయి ఉన్న పైసా చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ కారణంగానే ఆటోనగర్ సూర్య వెనక్కి వెళ్లిందో లేక ఇంకా దీనికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోలేదో అనేది మాత్రం తెలీలేదు.