దిశా దశ తిరిగింది

తమిళ్‌ పదమ్‌ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకి పరిచయమైన దిశా పాండే ఇప్పుడు టాలీవుడ్‌లో రెండు సూపర్‌ ప్రాజెక్ట్స్‌ సొంతం చేసుకుని ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని తనవైపుకి తిప్పుకుంది. నాగచైతన్య హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’…

తమిళ్‌ పదమ్‌ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకి పరిచయమైన దిశా పాండే ఇప్పుడు టాలీవుడ్‌లో రెండు సూపర్‌ ప్రాజెక్ట్స్‌ సొంతం చేసుకుని ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని తనవైపుకి తిప్పుకుంది. నాగచైతన్య హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో రూపొందే ‘ఒక లైలా కోసం’ సినిమాతో దిశ తెలుగు చిత్ర సీమకి పరిచయం అవుతోంది. 

ఈ సినిమా ఇంకా సెట్స్‌ మీదకి వెళ్లకముందే ఆమెకి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో లీడ్‌ రోల్‌ దక్కింది. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో దిశా పాండే కథానాయికగా ఎంపికైంది. చిరంజీవి కుటుంబం నుంచి వస్తున్న హీరోల్లో వరుణ్‌తేజ్‌పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో దిశా లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందని చెప్పవచ్చు. 

ఈ రెండు సినిమాల తర్వాత ఆమెకి ఏ స్టార్‌ హీరోతో ఛాన్స్‌ వచ్చినా కానీ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అసలే హీరోయిన్ల కొరత బాగా ఉన్న టైమ్‌లో వచ్చింది కాబట్టి దిశా పాండేకి ఒక్క హిట్టు పడితే చాలంతే.