కొన్నేళ్ల క్రితం వరకు మినిమం గ్యారెంటీ స్టార్ అయిన రవితేజ ఇటీవలి కాలంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. వరుసగా పరాజయాలు ఎదుర్కోవడంతో పాటు తన సినిమాలకి ప్రేక్షకులు థియేటర్లకి కదలిరాని పరిస్థితి తెచ్చుకున్నాడు. మూస సినిమాలతో చేజేతులా ఇబ్బందుల్లో పడ్డ రవితేజ మొనాటనీ బ్రేక్ చేయడం కోసమని వెరైటీ కథల కోసం అన్వేషిస్తున్నాడు.
రొటీన్‌కి భిన్నమైన ఆలోచనలతో సినిమాలు తీసే వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' ఓకే చేసుకున్నాడు. అయితే పడిపోయిన మార్కెట్ ఇప్పుడు రవితేజకి శాపంగా మారింది. కనీసం ముప్పయ్ కోట్లు బడ్జెట్ అయినా లేనిదే ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా తెరకెక్కించడం అసాధ్యమట.
కానీ రవితేజ మార్కెట్ అంత లేదిపుడు. దర్శకుడు ఆనంద్కి కూడా బిజినెస్ పరంగా క్రేజ్ తెచ్చే పేరు లేకపోవడంతో డిస్కోరాజాని చాలా లో బడ్జెట్లో తీస్తేనే నిర్మాతకి వర్కవుట్ అవుతుందట. తన మార్కు వినోదాత్మక చిత్రాలకి కాలం చెల్లిపోవడంతో, కాన్సెప్ట్ సినిమాలకి క్వాలిటీ కావాల్సి రావడంతో ఏమి చేయాలో తెలియని అయోమయంలో ప్రస్తుతం ఖాళీగా వున్నాడు రవితేజ.